అలా మాట్లాడటం ప్రజలను అవమానపర్చడమే.!

 అలా మాట్లాడటం ప్రజలను అవమానపర్చడమే.!

ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!.

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి నికార్స‌యిన తెలంగాణవాది కాదు..తెలంగాణ ఉద్యమం సమయంలో.. ఉద్యమ సమయంలో చంద్రబాబు చంకలో ఉండి రైఫిల్ తో తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదా అని ప్రశ్నించారు..!.ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏడాది కాకుండానే డబ్బు సంచులతో కూల్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి కాదా..?.మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాట్లాడడం చూసి, ఊసరవెల్లి కూడా రేవంత్‌ని చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాక ముందు నాడు కరెంటు కష్టాలు, బీడు భూముల, రైతు ఆకలి చావులు, బొంబాయి దుబాయ్ బతుకులని, కెసిఆర్ పాలనలో అతి తక్కువ సమయంలో అద్భుతమైన పరిపాలన అందించారన్నారు..,!. మూడున్నర సంవత్సరాలు కాళేశ్వరం నిర్మించి రైతులకు నీళ్ళు అందించి వ్యవసాయ పండుగ చేసారు.పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వ దేశంలో కెసిఆర్ ప్రభుత్వం ఒక్కటే…ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ కావడంతో రైతులోకానికి ఇబ్బందుల్లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగుకు 24గంటల కరెంట్‌, సాగునీటి ప్రాజెక్టులతో పాటు చివరకు పండించిన పంటను కొనుగోలు చేయ డం వరకు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండంత అండగా నిలుస్తున్నారు.ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, 102 సేవలు, యాదవులకు గొర్రెల యూనిట్లు, మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీ, బీసీలకు రుణాలు, ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధికి బాటలు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, కొత్త జిల్లాలు, నూతన మండలాలు, నూతన గ్రామపంచాయతీ ను ఏర్పాటు చేసింది కెసిఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు…,!

దేశం లో తెలంగాణ పోలిన రాష్ట్రం కాని గ్రామం కానీ లేదు..పదేండ్లలోనే తెలంగాణను దేశంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్‌ ప్రభుత్వం.కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సుభిక్షం సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది.!.కేసీఆర్‌ పాలనలో.. తెలంగాణ సుభిక్షం.ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో అద్భుత పురోగతి, జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, పంటల సాగు, విస్తీర్ణం, సాగు, అటవీ విస్తీర్ణం.. ఇలా అన్నింటా రికార్డే ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌-2024 నివేదికలో వెల్లడి.అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అని అన్నారు..!

జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, వ్యవసాయం.. ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్‌ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌-2024’ నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్పిందని తెలిపారు..!.కేసీఆర్‌ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చెంపపెట్టన్నారు..!.రెండుసార్లు ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయలేదని మాట్లాడేవారికి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది…,!.కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను ప్రజలకు అందించాలని హితవు పలికారు…!.

కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు ఒక్క‌సారి కాదు, ప‌ది సార్లు అవ‌కాశం ఇచ్చారు కానీ, 50 ఏండ్ల పాటు అధికారంలో ఉండి తాగునీరు, సాగునీరు, క‌రెంట్, ఎరువులు, విత్త‌నాలు ఇవ్వ‌కుండా రైతుల‌ను ఇబ్బంది పెట్టిందన్నారు..!. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు..!.ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు..ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి దుమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆమలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *