అమరావతి అభివృద్ధికి 15వేల కోట్లు
కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు..
అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని అన్నారు ..
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయం చేస్తాం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం.. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తాం.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు.. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు..