ఫలించిన బీఆర్ఎస్ వ్యూహం-కౌశిక్ రెడ్డి సక్సెస్..!

 ఫలించిన బీఆర్ఎస్ వ్యూహం-కౌశిక్ రెడ్డి సక్సెస్..!

పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ పై విజయం సాధించాడు కౌశిక్..గెలిచిన నాటి నుండి దూకుడుగా ఆయన పనిచేస్తున్నారు.అసెంబ్లీలో సైతం గర్జిస్తున్నారు.వరుస ప్రెస్మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు..బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో నెల క్రితం అరెకెపుడి గాంధీకి గట్టి సవాల్ విసిరారు..గాంధీ కి కౌశిక్ రెడ్డికి మధ్య ఓ పెద్ద యుద్దమే జరిగింది..

తాజాగా కరింనగర్ లో జరిగిన ఒక అధికారక సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ బీఆర్ఎస్,కేసీఆర్ పై విమర్శలు చేయడంతో అక్కడే సమావేశంలో ఉన్న కౌశిక్ రెడ్డి నీది ఏ పార్టీ అంటూ సంభోదిస్తూ ఫైర్ అయ్యారు,గతంలో కాంగ్రెస్ లో చేరినప్పటికి మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అంటూ దబాయించుకువచ్చిన పిరాయింపు ఎమ్మెల్యేలు కౌశిక్ కౌంటర్ తో మేం కాంగ్రెస్ఎ మ్మెల్యేమంటూ అధికారక సమావేశంలో ప్రకటించారు.

దీంతో బీఆర్ఎస్ వ్యూహంలో జంపింగ్ ఎమ్మెల్యేలు చిక్కుకున్నట్టు తెలుస్తుంది.తమ నోటి నుండే తాము పార్టీ మారామని చెప్పించాలనే వ్యూహం పనిచేసింది.. ఈ విషయంలో కౌషిక్ రెడ్డి సక్సెస్ అయ్యారని చర్చ జరుగుతుంది.ఇప్పటికే పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుండటం,తాము కాంగ్రెస్ అని వాళ్ళే ప్రకటించడంతో కౌషిక్ దెబ్బకు వారు డిపెన్స్ లో పడ్డట్టు తెలుస్తుంది..మొత్తానికి వారి నోటి నుండే తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలమని చెప్పించడంలో కౌశిక్ రెడ్డి విజయం సాధించారనే చెప్పవచ్చు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *