జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…?

 జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…?

Step Towards Jamili Polls by Centre

మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని సభ నియామక తేదీగా నిర్ణయిస్తారు. దీంతో 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాతనే జమిలీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది..

నియామక తేదీ నుండే ఐదు ఏండ్ల పాటు లోక్ సభ పదవీకాలం ఉంటుంది. నియామక తేదీ నుండి ఏర్పడే అసెంబ్లీల పదవీకాలం కూడా లోక్ సభ పూర్తి పదవీ కాలంతో పాటు ముగుస్తుంది. అయితే ఒక శాసనసభ పదవీకాలం రద్ధయితే మిగిలిన కాలానికే మాత్రమే ఎన్నికలు జరుగుతాయి అని ఆబిల్లులో స్పష్టంగా పేర్కోన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *