నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యం

గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు..
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని..
ప్రధానమంత్రి నరేందర్ మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్ ద్వారా 15 వేల కోట్ల రూపాయలను ఇప్పించారు.. గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని సీఎం చంద్రబాబు అన్నారు..
