నిలబడి నీళ్ళు తాగోద్దా…?
ఉరుకుంటూ పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగోచ్చు అని పెద్దలు ఓ సామెత చెబుతుంటారు. అయితే నిలబడి నీళ్ళు తాగోద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే నిలబడి కంటే కూర్చోని నీళ్లు తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు.
నిలబడి నీళ్ళు తాగడం వల్ల నీళ్లు ప్రత్యేక్షంగా డైరెక్టుగా పొట్టబాగంలోకి చేరుతుంది. దీంతో పొట్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా నిలబడి నీళ్ళు తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ సైతం ప్రభావితమవుతుంది.
నీరు త్వరగా పొట్టలోకి చేరడం వల్ల కింద భాగంలో నొప్పి రావడం .. అదే కూర్చోని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్డ్స్ గా ఉంటుంది. దీంతో బాడీకి అవసరమైన ఖనిజాలు అందుతాయి. ఆరోగ్యం సక్కగా ఉంటుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.