తెలుసుకోని మాట్లాడండి -రేవంత్ కు హీరోయిన్ వార్నింగ్..!

Revanth Reddy is a joker.. a paper tiger..!
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకోని మాట్లాడండి. నేనేమి AI ఆధారిత వీడియోలను కానీ ఫోటోలను కానీ పోస్టు చేయలేదు. అన్ని వివరాలను తెలుసుకోని మాట్లాడాలి అని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా అన్నారు. కంచ గచ్చొబౌలి భూముల వివాదంలో కొంతమంది నకిలీ వీడియోలు.. ఫోటోలను ఏఐ తో తయారు చేసి అసత్య ప్రచారం చేశారనే కారణంతో వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెల్సిందే.
దీని గురించి హీరోయిన్ దియా మీర్జా స్పందిస్తూ ” తాను ఎలాంటి నకిలీ వీడియోలు..ఫోటోలను షేర్ చేయలేదు. యూనివర్సిటీ వాస్తవ తాజా పరిస్థితులకు సంబంధించి నిజమైన ఫోటోలను.. వీడియోలను మాత్రమే షేర్ చేశాను.
నాలుగోందల ఎకరాల భూముల కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నేను ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియోలు.. ఫోటోలు పోస్ట్ చేశానని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఒక్కటి కూడా ఏఐ ఆధారిత ఫోటో కానీ వీడియో కానీ నేను పోస్టు చేయలేదు. ఏదైన మాట్లాడే ముందు తెలుసుకోని మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె వార్నింగ్ ఇస్తూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
