తెలంగాణ షాడో సీఎంగా మహిళా నేత…!

A female leader as the shadow CM of Telangana…!
తెలంగాణ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ వ్యవహారిస్తున్నారు అని బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు.
షాడో సీఎంగా మీనాక్షి నటరాజన్ పని చేస్తున్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు.. సమావేశాలు నిర్వహించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు.
గాంధీ భవన్ లో సమావేశాలు నిర్వహించాల్సిన మీనాక్షి నటరాజన్ సచివాలయంలో నిర్వహిస్తున్నారు అని ఆరోపించారు. ఏహోదాలో మీనాక్షి సచివాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ హెచ్ సీయూ లో విధ్యార్థులపై అక్రమ కేసులు పెట్టాలి. జైళ్లకు పంపాలి. యూనివర్సిటీలో పోలీసు బలగాలను ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేస్తారు.
విద్యార్థులపై పెట్టిన కేసులన్నీంటిని ఉపసంహారించుకోవాలి. సంగారెడ్డి జైల్లో ఉన్న ఇద్దరు విద్యార్థులను వదిలిపెట్టాలి. వాళ్లపై పెట్టిన కేసులన్నీంటిని వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకు ఆదేశాలు ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే షాడో సీఎం మీనాక్షి నటరాజన్ అని ఆయన అన్నారు.
