పాపం.. ఆయన్ని హీరోగా అంట చూడండి ప్లీజ్..!

అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా నేతలతో సహా మేధావులు.. అన్ని వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలన్ లా చూస్తున్నారు. అందరూ నన్నే తిడుతున్నారు అని నిన్న శనివారం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో ఏ సీఎం కు దక్కని అవకాశం నాకు దక్కింది.
కాంగ్రెస్ యువనాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణలో కులగణన ప్రక్రియ నిర్వహించాము.ఈ కులగణనతో బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో మేలు జరుగుతుంది. అయిన సరే ఇవన్నీ ఆలోచించకుండా నన్ను దోషిగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు సైతం నన్ను టార్గెట్ చేస్తూ ప్రజల్లో విలన్ లా చిత్రీకరిస్తున్నారు .
ఇప్పటికైన బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల నేతలు.. ప్రజలు నేను చేసిన మంచి పని గురించి చెబుతూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. రాజకీయ వర్గాలు ప్లీజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంట హీరోగా చూడండి అని సెటైర్లు వేస్తున్నారు. నాడు కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో బీసీలు యాబై రెండు శాతముంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఎలా తగ్గుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.