జగన్ కి షాక్..?

YS Jagan Mohan Reddy Andhrapradesh Former Cm
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని అప్పటి వైసిపి ఎంపి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు 2021 లో వేసిన పిటీషన్ వేశారు.ఆ పిటీషన్ సత్వర విచారణ కోసం వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ఆదేశించింది.
జస్టీస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుంది అని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని సీబీఐ తరపున లాయర్ కోర్టుకు తెలిపారు.
అప్పట్లో అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్ నుండి మరోరాష్ట్రానికి మార్చాలి. జగన్ బెయిల్ రద్ధు చేయాలని ఆర్ఆర్ఆర్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి మనకు తెల్సిందే.