ప్రభాస్ తో రిలేషన్ వార్తలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఇప్పటికి ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ “నా మీద టీడీపీ ఎమ్మెల్యే.. హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు.!
మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అప్పుడు గాడిదలు కాశారా. ?విచారణ ఎందుకు చేయలేదు.? ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా.? అని ప్రశ్నించారు. మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.
ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఈ ప్రచారం చేయించారు. నా వీడియో చూయించి జగన్ సానుభూతి పొందాలని చూశారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్లో పెడతారు.. తనపై దుష్ప్రచారం చేయిస్తారు’’ అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.