BJPలో BRS విలీనంపై MP ఈటల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది.. రాజ్యసభ పదవి వస్తుంది.. కేసీఆర్ కు గవర్నర్.. కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ…బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహజనితం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది గత ఎనిమిది నెలలుగా డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. మొదట్లో మేడిగడ్డ కూలిపోయిన సంఘటనను రాజకీయంగా వాడుకున్నారు.ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు అని కొన్ని రోజులు రాజకీయాలు నడిపారు..
ఎవరూ ముందుకు రాకపోయే సరికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే రాగం ఎత్తుకున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కు చీఫా.. తెలంగాణ బీజేపీకి చీఫా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయాల్లో మీడియాలో సంచలనం కావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. ముప్పై ఒక్కటి వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే చేశారు.. హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా ఆపాలి.. వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపించాలి.. పదేండ్లలో బీఆర్ఎస్ పై వచ్చిన వ్యతిరేకత కేవలం ఏడు నెలల్లోనే కాంగ్రెస్ పై వచ్చిందని “ఆయన అన్నారు.