ఎస్సీ వర్గీకరణ ఆగే ప్రసక్తే లేదు..!

Damodar Raja Narasimha Health and Medical Cabinet Minister of Telangana
తాము ఎవరికీ భయపడేది లేదు.. ఎస్సీ వర్గీకరణ అగే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. మాదిగ మాదిగ ఉప కులాల నాయకులు నిన్న గురువారం మంత్రి దామోదర రాజనరసింహాను కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ మాదిగల సమిష్టి కృషి.. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న కమిట్మెంట్ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు.
గత ఏడాది ఆగస్ట్ ఒకటో తారీఖున వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు హామీచ్చారు. దేశంలోని తొలిసారిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేసి తీరుతామని అన్నారు. అన్నట్లుగానే చట్టపరమైన ఎలాంటి ఇబ్బందులు రాకుండా జ్యూడిషీయల్ కమిషన్ ను నియమించారని అన్నారు. కమీషన్ శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసింది. నివేదిక రాగానే నిర్ణయం తీసుకోని అసెంబ్లీలో ప్రవేశపెట్టామని అన్నారు.
