సామ్ ఓ బచ్చా – ఆకాశ్ చోప్రా

 సామ్ ఓ బచ్చా – ఆకాశ్ చోప్రా

ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్‌ కొన్‌స్టాస్‌. 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.

అప్పటి నుంచి కొన్‌స్టాన్ అనవసరంగా మ్యాచ్‌లో నోరు పారేసుకుంటున్నాడు. టీమ్‌ఇండియా ప్లేయర్‌లను స్లేడీజింగ్ చేస్తున్నాడు శుక్రవారం ఐదో టెస్టు తొలి రోజు కూడా బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు.

భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత్‌లో టెస్టు పర్యటనకి వస్తే కొన్‌స్టాస్‌కి రియాలిటీ ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. కొన్‌స్టాస్‌ తీరుపై చోప్రా సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు .

‘కొన్‌స్టాస్‌ని ఓ టెస్టు సిరీస్‌కు భారత్‌ తీసుకురండి. మనమేంటో అతడికి చూపిద్దాం’ (సొంత ప్రేక్షకుల మధ్య ఆడితే బలం ఉంటుంది అనే ఉద్దేశంలో) అని ఓ పోస్ట్ షేర్ చేశాడు.

సిడ్నీ టెస్టు తొలి రోజు ముగుస్తుందనగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. రెండో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌ వేయబోతుండగా, స్టైకింగ్​లో ఉన్న ఖవాజా ఆగాలంటూ సైగ చేశాడు. అప్పుడు కొన్‌స్టాస్‌ ఆగమని బుమ్రాకి సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. బుమ్రాకి కొన్‌స్టాస్‌ తీరు నచ్చలేదు, ‘నీ సమస్య ఏంటి’ అని కోపం గా అడిగేడు. అంపైర్‌ కలగజేసుకొని ఇద్దరినీ దూరంగా పంపి పరిస్థితి చక్కదిద్దేడు . ఆ తరువాత బాల్ కే ఖవజ ఔట్ అయ్యేడు.

అయితే మెల్​బోర్న్​ టెస్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి కొన్‌స్టాస్‌ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అతడి స్లెడ్జింగ్ క్రీడాస్ఫూర్తిని దాటుతోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *