రూ.100తో రూ.5లక్షల బీమా..?
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు నుండి టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది.
రూ.100సభ్యత్వంతో రూ.5లక్షల ప్రమాద బీమా ఆ పార్టీ ఇవ్వనున్నది. అలాగే ఆ కార్యకర్తకుటుంబానికి చెందిన సభ్యులకు విద్య, వైద్య,ఉపాధి కోసం కూడా సాయం అందిస్తారని తెలుస్తుంది.
మరోవైపు త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో జాబితాను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్ళ గుసగుసలు. పార్టీ కోసం కష్టపడేవాళ్లకే పదవులు ఇవ్వాలని బాబు నిర్ణయమట.