గుండంపల్లిలో మంత్రి సీతక్క పర్యటన

 గుండంపల్లిలో మంత్రి సీతక్క పర్యటన

Loading

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుండంపల్లి లో పండిట్ భాను ప్రసాద్ శాస్త్రి వేదమంత్రాల మంత్రోత్సరణ వారి దివ్య కరకరములచే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొన్నారు …

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ వారు కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శిథిలవస్థలో ఉంది మహాశివరాత్రి రోజున స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కళ్యాణ ఘట్టం నిర్వహిస్తారు పర్వదిన సందర్భంగా చుట్టూ నలుమూలల గుండంపల్లి, తిమ్మపురం, కోనాపురం, ఓటాయి , పొగుళ్ల పల్లి, ఎదుల్లపల్లి రాంపూర్ కొత్తగూడ, మేడపల్లి, అశోకనగర్ నర్సంపేట వరంగల్ పలు పట్టణ గ్రామాల నుండి ఇక్కడ భక్తులు పోటెత్తుతారు భక్తులకు మౌలికమైన వసతులు ఆలయ అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కావాలని మంత్రి డాక్టర్ సీతక్కకు వినతి పత్రం అందజేసిన గుండంపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ కమిటీ..

ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *