“రైతు భరోసా” రైతులకా ..?.. అనుచరులకా….?
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ ” కేవలం పంటలు వేసే రైతులకు మాత్రమే ఏడాదికి ఎకరాకు రెండు పంటలకు కలిపి పదిహేను వేలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేస్తాము. పంట వేయని రైతులకు ఇవ్వము అని తేల్చి చెప్పారు.
ఆయన ఇంకో అడుగు ముందుకేసి గత ప్రభుత్వ రైతుబంధు పథకం పేరుతో ఇరవై ఐదు వేల కోట్ల ప్రజల సొమ్మును కొల్లగొట్టారు అని విమర్షించారు. తుమ్మల చేసిన పంటలేసిన రైతులకే రైతుభరోసా అన్న వ్యాఖ్యలు అందరూ ఆహ్వానించదగ్గదే. మరోవైపు ఎన్నికల్లో సీజన్ కు ఎకరాకు అని హామీచ్చారు.
రైతుభరోసాపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో ఆ పథకం దక్కాలంటే నాయకులు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పదు. .దీనికి కారణం లేకపోలేదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు చెబితేనే పథకాలు అందిస్తామన్నారు. అంటే కమిటీ నాయకులు చెప్పినవారికి మాత్రమే రైతుభరోసా ఇవ్వాలి. అంటే మంత్రి చెప్పినట్లు పంట ఎవరూ వేశారు.. ఎన్ని ఎకరాల్లో వేశారు అని రైతుభరోసా పైసలు ఇవ్వాలంటే ఫైనల్ చేయాల్సింది ఏఈఓ ..
దానికంటే ముందు అక్కడి స్థానిక నాయకత్వం ముఖ్యమంత్రి గారి మాటల ప్రకారం. అంటే పంట వేశాక దాన్ని ఒకే చేయాలంటే అధికారులకో నాయకులకో సమర్పించుకోవాలి అన్నట్లు. ఈవంతున మరో రకంగా రైతుల సొమ్ము. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టడానికి తెర తీసినట్లవుతుంది..ఎన్నికలకు ముందు సీజన్ కు ఎకరాకు పదిహేను వేలు అన్నారు.. ఇప్పుడేమో రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు అంటున్నారు.ఇలా వాళ్ల అనుచరులకే.. పార్టీ నేతలకే భరోసా తప్పా మాకు భరోసా లేదు.. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అవకతవకలు జరిగాయి అనేది మనం చూశాము . అందుకే కేసీఆర్ అందించిన రైతుబంధు మాదిరి పథకం అమలు చేస్తే నేరుగా రైతుల ఖాతాల్లోనే దళారుల ప్రమేయం.. అధికారుల ప్రమేయం లేకుండా పడతాయని రైతులు అభిప్రాయ పడుతున్నారు.