ధర్మం, న్యాయం గెలిచింది..

6 total views , 1 views today
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు పై నమోదు అయిన ఫోన్ టాపింగ్ కేసు ను కోర్టు కొట్టి వేయమని తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని బి ఆర్ ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి చక్రధర గౌడ్ మాజీ మంత్రి హరీష్ రావు పై మోపిన తప్పుడు కేసును కోర్టు కోట్టి వేయడంతో హరీష్ రావు మచ్చలేని మనిషి అని మరోసారి నిరూపితమైందన్నారు. చక్రధర్ గౌడ్ ను అడ్డం పెట్టుకొని సీఎంఓ ఆఫీస్ ద్వారా కేసు నమోదు చేయించ గలిగారు కానీ హరీష్ రావు నీతి,నిజాయితీ ముందు ఆ కేసు నిలువ లేకపోయిందన్నారు.
ఇకనుండి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు పై అసత్య ఆరోపణలు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయించడం మానుకోవాలన్నారు. ఈ కేసులో ప్రభుత్వం జీవో తీసి న్యాయవాదులను ఏర్పాటు చేసి ప్రజా ధనం, సమయం వృధా చేశారన్నారు.. తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజా పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని హితువు పలికారు. ఈ మీడియా సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు అత్తర్ పటేల్, ఇర్షాద్ హుస్సేన్, మొహిజ్,సయ్యద్, అతిక్, రమేష్, చాంద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.
