తనదాక వస్తే గానీ తెలియలేదా రేవంతూ..?-ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని జర్నలిస్టులకు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.. వాస్తవానికి వార్తలు రాయాల్సిన వారే కొంతమంది రాజకీయ నాయకులకు.. కొన్ని పార్టీలకు వమ్ము కాస్తున్నారు . ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలి..
అంతే తప్పా కొన్ని రాజకీయ పార్టీల మాయలో పడి ప్రభుత్వంపై నిత్యం బురద చల్లకూడదు. ఉన్నది ఉన్నట్లు రాయాలి.. అవసరమైతే ప్రజల తరపున ప్రశ్నించాలి .. ప్రజలతో కల్సి పోరాడాలి.. రాజ్యాంగ వ్యవస్థలో వారికి సముచిత స్థానం ఉంది.. పార్లమెంటరీ వ్యవస్థలోనూ వారికి ఉన్న విలువ మాములుది కాదు. నన్ను కొంతమంది దిగజారి గుంపు మేస్త్రీ .. మరికొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు.
సమాజంలో ఒక వ్యక్తి మనకు నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి విలువ ఇవ్వాలి. ఎదుటి వారు విలువలు దాటితే మేము దాటుతాం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసే ముందు గతంలో మాజీ ముఖ్యమంత్రి.. గులాబీ దళపతి కేసీఆర్ ను ఉద్ధేశించి మాట్లాడిన మాటలను కొంతమంది జర్నలిస్టులు, బీఆర్ఎస్ శ్రేణులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
అప్పట్లో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను బక్కోడు అని.. రజకారు అని… పండబెట్టి తొక్కుతా.. పాలమూరు ప్రాజెక్టులో పండుకోబెడ్తా .. ముఖ్యమంత్రా అతను నియంతా అని చేసిన పలు వ్యాఖ్యలను ఇప్పటికి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు ఒక వ్యవస్థలో ఓ వ్యక్తి మనకు నచ్చకపోతే ఆ వ్యక్తిను విమర్శించవచ్చు .. ఆ వ్యక్తికి ఉన్న విలువ మనం ఇవ్వకపోయిన సరే కానీ ఆ వ్యక్తి కున్న పదవికి విలువ ఇవ్వాలి కదా అంటున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఈ మాటలు ఎక్కడకెళ్లాయి..
మీరు విలువ ఇచ్చారా..?. మీదాక వస్తే కానీ నొప్పి తెలియలేదా .. అప్పుడు మీరు చేసిందే ఇప్పుడు మేము చేస్తున్నాము.. జర్నలిస్టులుగా మేము ఎప్పుడు పదవులకు హోదాలకు విలువ ఇచ్చామే తప్పా ఎక్కడ ఎప్పుడూ కూడా మేము దిగజారి మాట్లాడలేదు.. కొంతమంది రాజకీయ పార్టీలతో సంబంధమున్నవారు మాట్లాడితే దాన్ని మాకు అంటగట్టడం ఎంతవరకూ కరెక్టో ఆలోచించుకోవాలి. అయిన మనం ఏది నాటితే అదే విత్తుతాం అనే నానుడి మరిచిపోతే ఎలా రేవంత్ రెడ్డి సారు అని జర్నలిస్టు సంఘాలు,నెటిజన్లు,బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నారు.