హైడ్రా వ్యతిరేకతపై రేవంత్ సరికొత్త స్కెచ్..?

 హైడ్రా వ్యతిరేకతపై  రేవంత్ సరికొత్త స్కెచ్..?

HYDRA

తెలంగాణలోని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకివ్వనున్నారా..?.. హైడ్రా వల్ల ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకత అడ్డుకట్టకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. హైడ్రాతో ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకడమే కాకుండా పార్టీ పెద్దల నుండి అక్షింతలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి.

అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాలో ఎవరెవరూ ఉన్నారు ఇలా అన్నింటిని లెక్క తీస్తున్నారు అంట. ఇందులో ఏ పార్టీకి చెందిన నేతలు ఎంతమంది ఉన్నారు..?. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ… మంత్రులున్నారా అనే లెక్కలు కూడా ఆరా తీస్తున్నారంట..

పదేండ్లలో కబ్జాకు సహకరించిన రెవిన్యూ ఇరిగేషన్ సంబంధితాధికారుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారంట. అందుకే ఇటీవల మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంత క్లియర్ గా ఎన్ని చెరువులున్నాయి. ఎన్ని కబ్జా అయ్యాయి అనే లెక్కలు చెప్పారంట.. అన్నింటిని లెక్కలు తీశాక మళ్లీ హైడ్రాతో చర్యలు తీసుకోనున్నారు అంట.

ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా తదితర చట్టాలపై కూడా బిల్లులను ఆమోదించనున్నారంట. సో హైడ్రాతో వచ్చిన వ్యతిరేకతను అరికట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్లాన్ చేశారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *