రేవంత్ నిశబ్ధ విప్లవ నాయకుడు
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిశబ్ధ విప్లవ నాయకుడని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత డా. మల్లు రవి అన్నారు. తమిళ నాడు రాష్ట్రంలో జయలలిత, కరుణానిధిని నిశబ్ధ విప్లవ నాయకులు అంటారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నెహ్రూ శాస్త్రీయ ఆలోచనలను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రక్షాళన ,ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ చేయడం సాధ్యం కాదని తమకు తెల్సునన్నారు. హైడ్రా ,మూసీ వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైన లక్షలాది మందికి లాభం కలుగుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం రేయింభవళ్లు కష్టపడుతున్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో విద్యావ్యవస్థను అగం చేసిండ్రు. రాష్ట్రంలో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.