బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.
అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ కంపెనీల్లో పెట్టి ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడానికి ఇదంతా చేస్తున్నారు” అని అన్నారు.