హారీష్ రావుకు రేవంత్ రెడ్డి కౌంటర్..!

Revanth Reddy’s counter to Harish Rao..!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ హారీష్ రావు తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు ఆయనకు లేవని విమర్శించారు.
తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హారీష్ రావును ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు తెలంగాణకు నీటిని అందిస్తున్నాయన్నారు.
ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తిని చర్చకు రమ్మనాలని హరీష్ కు సవాల్ చేశారు.కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించిన ఆయనకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవాడు..
రాష్ట్రాన్ని దోచుకున్నోడు.. తాగుబోతోడు’ జాతిపిత అవుతాడా అని హరీశ్ రావును ప్రశ్నించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవ్వదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతారన్నారని ఉద్ఘాటించారు.
