పుట్టిన గడ్డ ఋణం తీర్చుకోవాలి -రేవంత్ రెడ్డి పిలుపు
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ,తెలుగు ప్రజలను కోరారు…
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయి..బేగరి కంచె వద్ద నయా నగర నిర్మాణం చేపట్టబోతున్నాము .
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం పై గురించి ఎన్నారైలకు వివరించారు..
ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన పై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని…పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం వచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయని…ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని…
ప్రవాస పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు…