గతం మరిచిన రేవంత్ రెడ్డి ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మూసీ నది సుందరీకరణ.. హైడ్రా లాంటి పలు అంశాల గురించి ఆయన వివరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది సుందరీకరణకు లక్ష యాబై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఎవరూ.. ఎప్పుడు చెప్పారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మూసీ నది సుందరీకరణకు కేవలం రూ.141కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.. నగరం మధ్యలో నది ప్రవహించే హైదరాబాద్ లాంటి నగరం దేశంలోనే లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా వారీయర్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 తారీఖు జూలై నెలలో మీడియాతో మాట్లాడుతూ లక్ష యాబై వేల కోట్లతో మూసీ నది సుందరీకరణ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఎవరూ చెప్పారు అని మీడియాతో అంటున్నారు…
యమునా నది ఏ నగరం మధ్యలో నుండి పోతుంది..?.. కావేరి నది ఏ నగరం మధ్యలో నుండి పోతుంది..?. గంగా నది ఏ నగరం మధ్యలో నుండి పోతుంది అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మతిమరుపు ఏమైన ఉందా..?. లేదా పొద్దున ఒకటి రాత్రి పూట ఒకటి మాట్లాడే తత్వముందా.?. లేదా ప్రజలను పిచ్చోళ్ళను చేస్తున్నాడా..?…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కవర్ చేయలేక కాంగ్రెస్ వాళ్లు ఆగమాగవుతున్నారు. మెయిన్ మీడియా ను చేతుల్లో ఉన్నంతమాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియవా అంటూ ట్విట్టర్ ఫేస్ బుక్ లో వారు తెగ ట్రోల్స్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.