ఆ “చిన్న లాజిక్” ని మరిచిపోయిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని విలువైన ప్రభుత్వ భూములను,ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. హైడ్రాకు మోస్ట్ పవర్ ఫుల్ సిన్సియార్టీ డెడికేషన్ కమిట్మెంట్ ఉన్న ఐపీఎస్ అధికారైన రంగనాథ్ ఏవీ ను కమీషనర్ గా నియమించారు. కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఏవీ రంగనాథ్ ఐపీఎస్ సినీ నటుడు నాగార్జున దగ్గర నుండి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు ఆనంద్ పల్లం,టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్,సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి,తాజాగా వైసీపీ మాజీ ఎమ్మేల్యే కాటంసాని వరకు అందరికి హైడ్రా నోటీసులు పంపారు. కొన్నింటిని కూల్చేశారు.
మరికొన్నింటిని కూల్చడానికి సిద్ధమయ్యారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ హైడ్రా నోటీసులు సెలబ్రేటీలకు అయితే పంపి నెల రోజులు పదిహేను రోజులు గడవు ఇస్తారు. ఆ గడవులోపు వాళ్లే కూల్చాలి లేదా మేము కూల్చేస్తామని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంటారు. కానీ అదే సామాన్యులకైతే మాత్రం నోటీసులు ఇచ్చిన తెల్లారే అది కూడా కోర్టులకు సెలవులుండే వీకెండ్ రోజుల్లో కూల్చివేతలకు సర్వం సిద్ధం చేస్తారు. కూల్చివేతలకు, హైడ్రాకు ఎవరూ వ్యతిరేకం కాదు కానీ సామాన్యులను,సెలబ్రేటీలను ఒకేలా చూడాలి.. నోటీసులు ఇచ్చాక బాధితుల నుండి వివరణ అడగాలి..
ఆ వివరణ సరిగాలేకపోతే కదా కూల్చాల్సింది. ఇలా కోర్టులకు సెలవులుండే రోజుల్లోనో.. బాధితుల నుండి సరైన వివరణ అడగకకుండానో కూల్చివేతలు మంచిది కాదని తెలంగాణ వాదులు,రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. అన్యాయానికి అక్రమాలకు ఎవరైన వ్యతిరేకమే కానీ హైడ్రా చట్టం ప్రకారం వెళ్తే ఇలా వీకెండ్ కోర్టులకు సెలవుల రోజుల్లో కూల్చాల్సిన అవసరం ఏమోచ్చిందని వారి వాదన. మరి ఈ ప్రకారం ఆలోచిస్తే హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి చేస్తుంది రైటో రాంగో ఆలోచించుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరి ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయాడో ఆ రేవంత్ రెడ్డికే తెలియాలని రాజకీయ విశ్లేషకుల వాదన..