చైనా ఫోన్ లా రేవంత్ రెడ్డి పాలన..!

If you dare, three bills – Kavitha’s demand..
తెలంగాణలో నాడు కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంది. కానీ నేడు రేవంత్ రెడ్డి పలన చైనా ఫోన్ మాదిరిగా ఉంది. చైనా ఫోణ్ కు గ్యారంటీ ఉండదు.. వారంటీ ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి మాటలకు.. హామీల అమలుకు గ్యారంటీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
జగిత్యాల లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన అంతా తప్పుడు తడకలా ఉంది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ . కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలు ఎవరూ క్షమించరు. బీసీల తరపున బీఆర్ఎస్ పోరాడుతుంది.
వారికి న్యాయం జరిగేలా చూస్తుందని ఆమె అన్నారు. రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా రేవంత్ సర్కారు ఇబ్బంది పెడుతుంది. ఓ రైతు తన పంట ఎండిపోతుందని నాకు చెబుతుంటే కండ్ల వెంట కన్నీళ్లు వస్తున్నాయి. కాళేశ్వరంపై రాజకీయాలు చేయకుండా వెంటనే సాగునీళ్ళు వదలాలని ఆమె డిమాండ్ చేశారు.
