రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్ర భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి వివరించారు.. “స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన “ఆటోమోటివ్ డిపార్ట్మెంట్”ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు.
హైదరాబాద్లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు.