రేవంత్ రెడ్డి ఓ జోకర్.. పేపర్ పులి..!

Revanth Reddy is a joker.. a paper tiger..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని పులి… తురుంఖాన్ అనుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఓ జోకర్.. పేపర్ పులిగా తయారయ్యారని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాకారం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది.
అధికారం వచ్చే అవకాశం మా పార్టీ నేతల చేతుల్లో ఉంది. హైదరాబాద్ ను బేస్మెంట్ తో సహా కూల్చివేయడం ఖాయం. రేవంత్ రెడ్డి సీఎంగా ఎంత ఎక్కువకాలం ఉంటే మేము అంతగా బలపడతాము అని ఆయన అన్నారు.
