ఏ ఫైల్ ఎవరికి పంపాలో రేవంత్ రెడ్డికి తెలియదా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఏ ఫైల్ ఎవరికి పంపాలో..?. తన దగ్గరకు వచ్చిన శాఖ ఫైల్ ఏంటో కనీసం తెలియదా..?. అంత తెలివి లేని సీఎం రేవంత్ రెడ్డి అని అంటున్నారు బీఆర్ఎస్ కు చెందిన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి దగ్గరకు హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ పబ్లిక్ హెల్త్ కు సంబంధించింది. అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లో హెల్త్ ఉంది కాబట్టి ఆ ఫైల్ ను హెల్త్ డిపార్ట్మెంట్ కు పంపారు.
పబ్లిక్ హెల్త్ అనేది తన దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది అని కనీసం పరిజ్ఞానం లేని సీఎం రేవంత్ రెడ్డి. మనోడి తెలివి అట్లుంటది మరి. మనోడు పెద్దగా చదువుకోలేదు మరి. ఇది రేవంత్ రెడ్డి తెలివి . పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి పంపాలో .. ఏ శాఖ కిందకు వస్తుందో తెలియదు. ఈయనకు ఇరిగేషన్ గురించి ఎలా తెలుస్తుంది అని విరుచుకుపడ్డారు.