రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్..?

తెలంగాణలో గత పది నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది.
రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు వీడియోను ఆయన ట్వీట్ చేశారు.