సీఎం పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడు
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అకారణంగా, అసభ్యంగా ఎనుముల రేవంత్ రెడ్డి తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “‘అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. సీఎం పదవికి ఆయన అనర్హుడు. ఆడబిడ్డలను అవమానించిన రేవంతు వారి ఉసురు తగులుతుంది. మా మహిళా ఎమ్మెల్యేలు సొంతంగా కష్టపడి 5, 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరూ ఆయనలా రాజకీయ విన్యాసాలు చేయలేదు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.