కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్..!
బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. 10నెలల్లో తెలంగాణ సమాజం ఏమి కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాము. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాము.
ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. డీఎస్సీతో ఉద్యోగాల భర్తీ చేశాము.. ఆరోగ్య శ్రీని పెంచాము . మిమ్మల్ని తెలంగాణ సమాజం మరిచిపోయిందని కౌంటరిచ్చారు.