మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట..!

ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
అప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. మరోవైపు ఈనెల ముప్పై తారీఖు వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించిన సంగతి తెల్సిందే.
తాజాగా దాన్ని మంగళవారం వరకు పొడిగించడం గమనార్హం. అయితే విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ సహకరించాలని మాత్రం సూచించింది.
