ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

 ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Breaking News

Loading

ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు…

ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల  లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి 615,టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు.. మరోవైపు కూటమి ఇప్పటికి తమ అభ్యర్థి పేరును ఇంకా  ఖరారు చేయలేదు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *