రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్..!

 రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్..!

ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్ ,సముద్రఖని తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలై మిక్స్ డ్ టాక్ తో నడుస్తుంది.

ఈ క్రమంలో మూవీ బెనిఫిట్ షోలకు.. టిక్కెట్ల ధరల పెంపుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెల్సిందే. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి లేదు.. టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతివ్వము. సినిమావాళ్లు వ్యాపారం చేస్తున్నారు.. దేశానికి ఏమైన సేవ చేస్తున్నారా అని మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే.

గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ల పెంపుకు.. బెనిఫిట్ షోలకు అనుమతివ్వడంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” అసెంబ్లీలో మేము సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతివ్వము. ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చి చెప్పారు. తీరా మళ్లీ అనుమతిచ్చారు. మేము సినిమాలకు వ్యతిరేకం కాదు. ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాటలు మార్చడం ఏంటి.. రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ అయితే రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *