హైడ్రా గురించి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు అక్షింతలు
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. నార్త్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను కూల్చి వేతలపై ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైద్రాబాదు లో హైడ్రా పేరుతో కూలుస్తవా అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం..
పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడం పై మందలించారు.నీవు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది.ని స్వలాభం కాస్త పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది.కాంగ్రెస్ పార్టీ అంటే ని ఒక్కడిది కాదు.నీవు చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.హైకమాండ్ ఆదేశాలు భేఖాతారు చేస్తే భవిష్యత్తు లో ఇబ్బందులు తప్పవు.
ఒక్కరిద్దరు చేష్టల వలన పార్టీ పరువు పోతుంది.సీఎం అయిన కార్యకర్త అయిన పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరిస్తూ ముందుకు పోవాలి అని రాహుల్ గాంధీ సూచించారు..రేవంత్ ను కలిసి గైడ్ చేయాలని కేసీ వేణుగోపాల్ కు రాహుల్ ఫోన్ చేశారు. వెంటనే డిల్లీలో కేసి వేణుగోపాల్ తో భేటీ రేవంత్ రెడ్డి అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు విన్పిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే రేవంత్ తీరు పట్ల ఇప్పటికే అధిష్టానానికి పిర్యాదు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను గౌరవించడం లేదని మొర పెట్టుకున్నారు.అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైనట్లు వివరించిన కాంగ్రెస్ నేతలు..