సీఎం రేవంత్ రెడ్డి కి మద్ధతుగా రాహుల్ గాంధీ

 సీఎం రేవంత్ రెడ్డి కి మద్ధతుగా రాహుల్ గాంధీ

Revanth Reddy Rahul Gandhi

Loading

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి.. చెరువులను ..విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి తెల్సిందే.. మరోవైపు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తుతూ ట్విట్టర్ లో మద్ధతుగా నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ సైతం ముఖ్యమంత్రికి అండగా నిలిచినట్లు తెలుస్తుంది.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు.. పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డి తీసుకోచ్చిన హైడ్రాకు మద్ధతుగా నిలిచారని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడైన అనంద్ కు చెందిన స్పోర్ట్ విలేజ్ FTl పరిధిలో ఉందని హైడ్రా కూల్చివేసిందని సదరు మాజీ మంత్రి రాహుల్ గాంధీ దగ్గర మొర పెట్టుకున్నారు . అయితే దీనిపై స్పందిస్తూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. అతనికి మద్ధతుగా నిలవాలని సూచినట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *