పేరుకే ప్రజా పాలన.. ప్రశ్నిస్తే అరెస్టులు..?
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందా..?. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై.. ప్రజల సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు చేస్తారా..?. ఇవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఎంఆర్ అనే యువకుడు.. కెప్టెన్ ఫసక్ అనే నెటిజన్ .. గౌతమ్ గౌడ్ అనే జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వారి ఆరోపణ..
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా హైకోర్టుకు వెళ్లడం కెప్టెన్ ఫసక్.. ఎంఆర్ అనే నెటిజన్లకు బీఆర్ఎస్ లీగల్ సెల్ బెయిల్ తీసుకోచ్చింది.ఇంకా జర్నలిస్ట్ గౌతమ్ ఇష్యూపై కొట్లాడుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించడం.. ప్రజల తరపున కొట్లాడే హక్కు . బాధ్యత రెండు ప్రతి ఒక్క పౌరుడ్కి ఉంటాయి.. ప్రతి ఒక్క పౌరుడుకే కాదు ఓటేసిన ప్రతోక్కర్కి ఆ హక్కును రాజ్యాంగం కల్పించింది. అలాంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో.. విమర్శిస్తూ పోస్టులు పెడితేనో అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేధావివర్గం, బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టే సోషల్ మీడియాలో పార్లమెంటరీ లాంగ్వేజ్ ను పాలో అయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేయడం తప్పు అని ఆదేశాలు ఇచ్చింది. అలాంటి ఆదేశాలను బేఖాతర్ చేసి మరి ప్రశ్నిస్తున్నారనే నెపంతో ఈ ముగ్గుర్ని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం విడ్డూరం.. ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అక్రమ అరెస్టులతో.. కేసులతో ప్రశ్నించే గొంతును నొక్కలేరు. ఉద్యమంలో ఇలాంటి కేసులేన్నో చూశాము.. మాకు జైళ్లు కొత్త కాదు.. అరెస్టులు కొత్త కాదు.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాపాలనా..?. అక్రమ అరెస్టులతో కేసులతో నాలుగు కోట్ల ప్రజల తరపున ప్రశ్నిస్తున్న గొంతును నొక్కలేరని వారు అంటున్నారు.