కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ప్రమోషన్
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు తీసుకోవాలని ఈ రోజు హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసిన సంగతి తెల్సిందే.ఇందుకు నాలుగు వారాల సమయం కూడా ఇచ్చింది హైకోర్టు.
ఒకవైపు హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తుంటే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. తాజాగా అసెంబ్లీ కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది.
ఇందులో భాగంగా పీఏసీ చైర్మన్ గా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీని నియమించింది. మరోవైపు అంచనాల కమిటీ చైర్మన్ గా పద్మావతి రెడ్డిని… పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే శంకరయ్యను నియమించింది.. ఈ నియామకాలపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ ఇవ్వకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఇచ్చింది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెలపూడి గాంధీకి ఎలా ఇస్తారు.. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేదని ఆయన విరుచుకుపడ్డారు.