మూసీ పునర్జీవంలో  సహకరించండి..!

 మూసీ పునర్జీవంలో  సహకరించండి..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు.

మ‌హాత్మాగాంధీ గారి చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను చాటిచెప్పే కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, ప్రాజెక్టు వివరాలను కేంద్ర మంత్రికి సీఎం గారు తెలియజేశారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్రానికి చెందిన అందుబాటులో ఉన్న ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , రామసహాయం రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య , కుందూరు రఘువీర్ తదితరులతో కలిసి సీఎం ఢిల్లీలో రక్షణ మంత్రిని కలిశారు.

బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్ర‌చార కేంద్రం, ప్ర‌జా వినోద స్థ‌లాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర‌హం (Statue of Peace), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని సీఎం వివ‌రించారు. ఇందుకోసం ర‌క్ష‌ణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *