బాబు ఆటలో పవన్ నవ్వుల పాలు..?
సహాజంగా రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి ఎక్కువగా వింటూ ఉంటాము. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ నానుడి జనసేనాని పవన్ కళ్యాణ్ కు అక్షరాల సరిపోతుంది. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్ లో.. విజయవాడ వరదల విషయాన్ని డైవర్ట్ చేయడానికో.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అటకెక్కించడానికో తెల్వదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా మీడియా సమావేశం పెట్టి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సంచలన ప్రకటన చేశారు.
తాను అగ్గిపూల్ల గీసి చిచ్చు పెట్టిన దాన్ని పెద్దగా చేసి మంటగా మార్చే బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అప్పజెప్పినట్లుగా పవన్ తాను సనాతన ధర్మం పరిరక్షకుడిగా అవతారమెత్తి మీడియా ముందు ఊగిపోయాడు. ఎంతగా అంటే తానే ఓ యోగి ఆధిత్యానాథ్ లెక్క తానే ఓ రాజాసింగ్ లెక్క తానొక్కడే హిందు పరిరక్షకుడ్ని . నాకంటే ఎవరూ లేరనే స్థాయిలో రెచ్చిపోయారు .అఖరికి ఇటీవల జరిగిన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష తిరుపతి లడ్డూలు వెళ్లాయి.. అందులో కూడా కల్తీ జరిగిందని పవన్ ఉపన్యాసాలు మాములుగా ఇవ్వలేదు. అయితే ఆయోధ్య ప్రారంభోత్సవం జరిగింది మార్చి 2024,ఏఆర్ డెయిరీ నెయ్యి జూలై 2024 నాటిది. అంటే పవన్ వ్యాఖ్యాల్లో ఎలాంటి నిజం లేదని ఆర్ధమవుతుంది . అఖర్కి సుప్రీం కోర్టులో దీనిపై విచారించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురికి మొట్టికాయలు వేయడమే కాదు మూడు చెరువుల నీళ్ళు తాగించినంత పని చేసింది.
సరే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందే అనుకుందాం.. దీనికి ప్రామాణీక ఏంటి..? . సదరు కంపెనీ నుండి వాంగ్మూలం తీసుకున్నారా..?. రెండో ఓపినియన్ తీసుకున్నారా..?. కోట్లానుమంది మనోభావాలకు ప్రతీకైన ఇంత సున్నిత అంశాన్ని ఎలాంటి ఆధారం లేకుండా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయిన మీరు ఎలా చెబుతారు..?. జూలైలో కల్తీ రిపోర్టులు వస్తే సెప్టెంబర్ నెలలో ఎందుకు చెప్పారు..?. ఖచ్చితంగా కల్తీ జరిగిందని కంఠపథంగా చెబుతూ మళ్లీ సిట్ కమిటీ ఎందుకు వేశారు..?. అసలు దేవుడ్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగారు..?. ఇప్పటికే దేశ రాజకీయాలు కుల మతాలతో భ్రష్టూపట్టాయంటున్నారు.. కనీసం దేవుడ్నైన ఆ రాజకీయాలకు దూరంగా ఉంఛండి అని చంద్రబాబు & బ్యాచ్ పరువు తీసేలా వ్యాఖ్యానించింది. ఈ వార్తలను తన అస్థాన మీడియాలో ఒక్క ఛానెల్ తప్పా అన్ని ఛానెల్స్ ప్రసారం చేశాయి.
దీంతో చంద్రబాబు రాజేసిన నిప్పును మంటగా మార్చే బాధ్యతను తీసుకున్న పవన్ కళ్యాణ్ అది పూర్తి చేసే క్రమంలో అసలు వాస్తవాలను తెలుసుకోకుండా గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా ముందుకు దూసుకెళ్తూ నవ్వుల పాలయ్యారు అని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో కూటమిప్రభుత్వం వేసిన సిట్ కమిటీ విచారణనే ఆపేసింది. కల్తీ జరగడం తప్పు. అది ఎవరూ చేసిన శిక్ష పడాల్సిందే. కానీ ఇలా రాజకీయాల కోసం.. స్వలాభం కోసం దేవుడ్ని సైతం లాగడం… కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం తప్పు అంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో బాబు ఆడిన ఆటలో పవన్ అరటిపండుగా మారి నవ్వుల పాలైయ్యారు అంటున్నాయి రాజకీయ వర్గాలు.