కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక..!
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ వచ్చేదా అని యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కు చెందిన కొంతమంది గుండాలు.. నేతలు వెళ్లి దాడి చేశారు. కేసీఆర్ గారి ఫోటోను నేలకేసి కొట్టి మరి కాళ్లతో తొక్కారు. మీకు ఎన్ని గుండెల్రా కేసీఆర్ గారి ఫోటోను టచ్ చేయడానికి.. మీ తీరు మారకపోతే మేము సైతం మీ దారిలోకి వస్తాము. దాడికి ప్రతిదాడి చేసి తీరుతాము. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నేతల్లారా ఇప్పటికైన మీరు మీ తీరు మార్చుకోండి అని హెచ్చరిక చేశారు.
అసలు కేసీఆర్ ఉద్యమాలు చేయకపోతే.. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా..?. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా.. ఈ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు.. మంత్రులు అయ్యేవారా అని ఒక్కసారి ఆలోచించుకొవాలి. ఇదే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్లు నాకుతూ ఉండేవాడు కదా అని అన్నారు.