అరికెలపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ -ట్విస్ట్ ఇదే..?

 అరికెలపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ -ట్విస్ట్ ఇదే..?

arikelapudi gandhi

సహాజంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ.. అసెంబ్లీ వ్యవస్థ చాలా ముఖ్యం.. వీటికి సంబంధించి కమిటీలను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. తాజాగా అసెంబ్లీ కమిటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ప్రకటించింది. అసెంబ్లీ కమిటీల్లో ముఖ్యమైంది పీఏసీ కమిటీ. ఈ కమిటీ చైర్మన్ గిరిని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా మెజార్టీ సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇస్తారు. ఇది అనాధిగా వస్తోన్న ఆచారం. అసెంబ్లీ లా కూడా అదే చెబుతుంది.

అయితే తాజాగా ప్రకటించిన కమిటీల్లో పీఏసీ చైర్మన్ ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగం పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెల పూడి గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టబెట్టారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్యకు.. అంచనాల కమిటీ చైర్మన్ గిరి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఇచ్చారు. తర్వాత రెండు కమిటీలు ఒకే కానీ మొదటిదాని దగ్గర మాత్రం కాస్త ఆలోచించే బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి అప్పజెప్పినట్లు తెలుస్తుంది.

ఈ రోజు హైకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం ఖాయం అని రాజకీయ రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అరికెలపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ అప్పగించడం వెనక అసలు ట్విస్ట్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోమంటే పీఏసీ చైర్మన్ అరికెల పూడి గాంధీకివ్వడంతో సాంకేతిక ఫరంగా అరికెల పూడి గాంధీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గానే గుర్తించి ఇవ్వడం జరిగిందని భావించాలనే ఉద్ధేశ్యంతో ఇచ్చినట్లు అవుతుంది అని విశ్లేషకుల అభిప్రాయం.. ఎందుకంటే గాంధీలాంటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. జస్ట్ ఆ మాదిరిగా ఉన్న కండువా మాత్రమే కప్పుకోవడం ఇక్కడ విశేషం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *