అభివృద్ధి కోసం కాదు ఆస్తుల రక్షణ కోసం ..!
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ” కాంగ్రెస్ పై ప్రేమతోనో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో కాంగ్రెస్ లో చేరలేదు. కేవలం వారి ఆస్తుల పరిరక్షణ కోసమే పార్టీ మారారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ముందునుండి ఉన్న కాంగ్రెస్ నేతలకు.. కార్యకర్తలకు పలు అవమానాలు ఎదురవుతున్నాయి.
ఎన్నో కష్టాలను భరిస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ నేతలే పెత్తనం చెలాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి తమ పెత్తనాన్నే చెలాయిస్తున్నారు. అసలైన నిఖార్సైన కార్యకర్తలను నేతలను వాళ్లు అవమానిస్తున్నారు. ఈ అంశంపై ఆధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.
మధుయాష్కీ ఆరోపించినట్లుగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల వల్ల సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర నుండి నేతల వరకు అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఇటీవల గాంధీ భవన్ లో కల్సి నివేదికలు సమర్పించినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నయి. ఇప్పటికైన సరే పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలని వారు సూచిస్తున్నారు.