కొత్త మంత్రులు వీళ్లే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నరకు జరగనున్నది..ఈసారి విస్తరణలో ముగ్గురికి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.
వారిలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. ఇక అసెంబ్లీ ఉప శాసనసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్కు అవకాశం ఇచ్చారు.
