తెలంగాణ కు కొత్త ముఖ్యమంత్రి…?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆధిష్టానం గుర్రుగా ఉందా..?.గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు సార్లు అపాయింట్మెంట్ కోరిన కానీ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడలేదా..?. కాంగ్రెస్ కు చెందిన ఓరిజనల్ మంత్రులు.. ఎమ్మెల్యే. ఎంపీలు రేవంత్ రెడ్డి తీరుపై ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారా..?. అందుకే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తవారిని ముఖ్యమంత్రిని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ..
మీడియాతో ఆయన మాట్లాడుతూ “త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు.జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు.ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. దూరం నుంచి చూసి వచ్చాడు.
మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారు.సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదు..నేను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని ఆయన అన్నారు.