అక్కడ నడిపించే నాయకుడు కావాలి..?
ఆ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా మూడు సార్లు ఆ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది..?. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్న కానీ నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అదే పటాన్ చెరు.
పఠాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అక్కడ నుండి గూడెం మహిపాల్ రెడ్డి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాక ఇటు క్యాడర్.. అటు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కాక సతమతమవుతున్నారు. మహిపాల్ రెడ్డి తర్వాత తామే అన్ని అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆదర్శ్ రెడ్డి లాంటి నాయకులు మాత్రం ప్రకటనలకే పరిమితమవుతున్నారు .
ప్రజల సమస్యల.. క్యాడర్ ఇబ్బందులపై దృష్టి పెట్టడం లేదనేది వారి ఆవేదన.. జిల్లాకు చెందిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మొదట్లో ఇటు క్యాడర్ కు అటు ప్రజలకు భరోసానిచ్చిన కానీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసే నాయకుడు లేకపోవడంతో హారీష్ రావు ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు లెక్క మారింది. ఇప్పటికైన సరే నియోజకవర్గానికి ఇంచార్జ్ ను నియమించి ఉన్న క్యాడర్ ను కాపాడుకోవాలని కార్యకర్తలు, నేతలు సూచిస్తున్నారు. మరి ఇప్పటికైన ఆధిష్టానం కళ్లు తెరుస్తుందేమో చూడాలి..?