టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ కీలక సూచనలు..!

Lokesh as Deputy CM..!
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు.
మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక మిగతా వారి సమస్యలను తీసుకురండి. కానీ అమ్మలాంటి పార్టీపై అలగకండి. మూడో వ్యక్తి చెప్పిన మాటలు వినకండి. విని నమ్మకండి. మీరు లైవ్ లో ఉండి చూసినవి.. విన్నవి నమ్మండి.
మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్లకు పనులు చేస్తున్నారు. మనవాళ్లకు చేయడం లేదు. మనవాళ్లను కలవరు. బాబు గారూ ఎవర్ని కలవరు అనే మాటలను నమ్మకండి.. దయచేసి గ్రామాల్లో ఐక్యమత్యంగా ఉండండి.
గ్రామ స్థాయి నాయకులతో పనులు చేయించుకోండి. అప్పటికి కాకపోతే మండల స్థాయి నాయకుల దగ్గరకెళ్లండి. అప్పుడు కాకపోతే ఎమ్మెల్యే దగ్గరకెళ్లండి. అక్కడ కాకపోతే ఇంచార్జ్ మంత్రుల దగ్గరకెళ్లండి. వాళ్లు చేయకపోతే పార్టీ సెంట్రల్ ఆఫీసు దగ్గరకు రండి’ అని సూచించారు.