చైనా వస్తువులను బ్యాన్ చేయండి: రేణూ దేశాయి

Renu Desai Indian Actor
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి రేణూ దేశాయి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా భారతీయులకు ఓ కీలక సూచన చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘ ఎవరూ చైనా వస్తువులను కొనకండి.
ఏదైన వస్తువులను కొనేముందు అ వస్తువుల లేబుల్ ను గమనించండి. మేడిన్ చైనా ఉంటే తీసుకోవద్దు. మేక్ ఇన్ ఇండియా వస్తువులనే కొందాము. మీరు చేసినట్లే ఇతరులు కూడా చైనా వస్తువులను కొనవద్దు అని ప్రచారం చేయండి.
నేను ఇప్పటివరకూ ఒక్క చిన్న వస్తువును సైతం చైనాకు చెందింది కొనలేదు. మీరు కొనకండి. నిజంగా మీకు దేశంపై భక్తి, ప్రేమ ఉంటే ఇది పాటించండి’ అంటూ పోస్టు చేశారు.